![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1082 లో.. నాకు నమ్మకద్రోహం చేశారు మమ్మీ అని శైలేంద్ర అంటాడు. అసలేం జరిగింది? నిన్ను నమ్మకద్రోహం చెయ్యడమేంటని దేవయాని అంటుంది. నా చేతులతో నేనే రాజీవ్ ని పోలీసులకి పట్టించానని.. జరిగింది మొత్తం శైలేంద్ర చెప్తాడు. అప్పటికే డౌట్ వచ్చింది. నాకు ఎందుకు ఇదంతా చెప్పలేదని దేవయాని అడుగుతుంది. నీకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నానని శైలేంద్ర అంటాడు. సర్ ప్రైజ్ కాదు ఇంత పెద్ద షాక్ ఇచ్చావని దేవయాని అంటుంది.
అప్పుడే ధరణి వచ్చి.. ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది. మేమ్ టెన్షన్ పడట్లేదని దేవయాని అంటుంది. కాఫీ తీసుకొని రమ్మంటారా అని ధరణి విసిగిస్తుంటే.. ఏం వద్దు ఇక్కడ నుండి వెళ్ళంటు శైలేంద్ర చిరాకుపడతాడు. ఆ రాజీవ్ ని నువ్వే పట్టించావని వాడికి తెలుసో లేదో కనుక్కోమని శైలేంద్రతో దేవయాని అంటుంది. మరొకవైపు మనుకి ఏంజిల్ ఫోన్ చేస్తుంది. ఎవరు మీరని మను అనగానే.. ఎవరంటున్నావ్? నా నెంబర్ సేవ్ చేసుకోలేదా అంటు ఏంజిల్ అంటుంది. ఎవరో చెప్పండి అని మను అంటుంటే.. ఏంజిల్ చెప్పదు దాంతో మను ఫోన్ కట్ చేస్తాడు. అయిన మళ్ళీ ఫోన్ చేస్తుంది. నేను ఏంజిల్ ని మీతో మాట్లాడాలని అనగానే.. తనకి ఇంట్రస్ట్ లేదన్నట్టు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు మను.
మరొకవైపు అనుపమ దగ్గరికి వసుధార వచ్చి మాట్లాడుతుంది మను తన తండ్రి విషయంలో ఉన్న ఆలోచన మార్చుకునేలా లేడు.. మీరైనా మను కి నిజం చెప్పండి అని వసుధార అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. నిజమేంటని అడుగుతాడు. దాంతో వసుధార ఏదో కవర్ చేస్తుంది. కాసేపటికి మనం ఈ విషయంలో మావయ్య గారికి దొరికిపోతామోనని భయంగా ఉంది అందుకే మీరే ముందు మను కి నిజం చెప్పండని అనుపమకి వసుధార సలహా ఇస్తుంది. ఆ తర్వాత మను ఒంటరిగా ఆలోచిస్తుంటే అప్పుడే ఏంజిల్ వచ్చి.. బయపెడుతుంది కానీ మను నుండి ఎలాంటి రియాక్షన్ ఉండదు. అసలేంటి నీ బాధ అని ఏంజిల్ ని మను అడుగుతాడు. నువ్వే నా బాధ అని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |